ఈ నిశి రేయి...
కురిసేటి వెండి వెన్నెలతో...
మెరిసేటి నక్షత్రాల మెరుపులతో...
ఊగేటి చిగురాకు కొమ్మలతో...
వీచేటి అల్లరి పిల్లగాలులతో...
మత్తుగొలిపే పరిమళ సువాసనలతో...
మది పులకరిస్తూ...
పరవశంతో పరుగులిడుతూ...
పంచెవన్నెల చిలకళ్ళే...
రివ్వున ఎగిరి...
గగన తీరాల అంచులని మీటి...
అలుపెరుగని ఆనందంతో,
ఆకాశ వీధులలో అలలల్లే సాగి,
అంతేలేని ఆనందపు లోగిలిలో ఊయలలు ఊగి...
నాతో ఉన్న నీకోసం...
చుట్టూ చూడగా
కనుచుపు మేరలో కానరాకుండా,
కంటిపాపలమీద నీరులా చేరి,
కంటి కొనలనుండి కరిగి జరిపోయావే
కలలన్నీ కల్లలే అని రుజువు చేసావే
ఎక్కడా నువ్వు లేవే...
నా గుండెలో జ్ఞాపకమై నిలిచావే...
మానని గాయమే రేపావే...
గతమునే వరముగనిచ్చావే...
నువ్వు లేవే!
నాకోసం తిరిగిరావే!!