పండు తిని తొక్క పారేయాలి... వినడానికి సరదాగా వున్నా నా జీవితాన్ని మార్చిన మాట ఇది.. తొక్క అంటుకుందని పండు పారేయంకదా... అలాగే మంచి చెడుల కలగలపైన ఈ సమాజంలో మంచినే గ్రహించి,కానిది వదిలేయాలి.. నిజానికి మనుషులంటేనే మంచివారు.. కొందరు ఎక్కువ మంచివారు.. ఇంకొందరు తక్కువ ... నూటికి నూటికి నూరు శాతం మంచితనం ఉన్న మానవులనే దేవతలంటారు.. కాబట్టి మనంకూడా మనలోని మంచితనాన్ని పెంచుకుంటూ అలాకావాలి... ఓంశాంతి